Rahul Dravid has been appointed as the new head coach of the Indian team. The news was welcomed with open arms within the Indian cricket fraternity and the overall cricket world as well.
#RahulDravid
#TeamIndia
#Cricket
#ViratKohli
#RohitSharma
#T20WorldCup
#RaviShastri
#AnilKumble
#KLRahul
#BCCI
ఊహించినట్టే భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితుడయ్యాడు.ఈ నెల 15వ తేదీన కోచ్‌గా ఛార్జ్ తీసుకోబోతున్నాడు. టీమిండియా న్యూజిలాండ్ పర్యటన అతని ఫస్ట్ టాస్క్. రాహుల్ ద్రవిడ్ నియామకం అనేది ఏకగ్రీవంగా ముగిసింది. అతను తప్ప మరెవరూ ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. దీనితో పోటీ లేకుండా హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు ద్రవిడ్. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. ఆ వెంటనే రాహుల్ ద్రవిడ్.. అతని స్థానాన్ని భర్తీ చేస్తారు. టీ20 ప్రపంచ కప్ తరువాత టీమిండియా- న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. ఈ సిరీస్ టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ద్రవిడ్ ఉన్నారు.